పాలీసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం

May 27,2024 12:28 #East Godavari

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : పాలిటెక్నిక్ కౌన్సిలింగ్ సోమవారం నాడు ఉదయం 9 గంటల నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పాల్ టెక్నిక్ కళాశాల బొమ్మూరు నందు ప్రారంభమయ్యాయి. ఉదయం నుండే విద్యార్థులు వారి తల్లితండ్రులు ఉదయమే బొమ్మూరు కౌన్సిలింగ్ సెంటర్కు చేరుకున్నారు. కౌన్సిలింగ్ మొదటిరోజు ఒకటవ ర్యాంకు నుంచి 12,000 ర్యాంకు వరకు కౌన్సిలింగ్ జరుగుతున్నట్లు ఉదయం 11 గంటల వరకు 25 మందికి కౌన్సిలింగ్ పూర్తి చేసామని ఈరోజు 12 వేల ర్యాంకు వరకు పూర్తి చేస్తామని కళాశాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వంక. నాగేశ్వరరావు తెలిపారు. కౌన్సిలింగ్లో కళాశాల ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వంకా. నాగేశ్వరరావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్ పి. జగన్మోహన్రావు చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ డి. శ్రీనివాస్ ఇతర సిబ్బంది ఈ కౌన్సిలింగ్ నందు పాల్గొన్నారు.

➡️