ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ని కలిసిన కుందుల

Jun 9,2024 12:24 #East Godavari

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : నిడదవోలు నియోజక వర్గం లో భారీ మెజారిటీ తో ఘన విజయం సాధించిన జనసేన, టిడిపి, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే కందుల దుర్గేష్ ను ఆదివారం ఆయన స్వగృహం రాజమండ్రిలో మర్యాదపూర్వకంగా కలిసిన నిడదవోలు నియోజవర్గ తెదేపా సీనియర్ నాయకులు కుందుల వీర వెంకట సత్యనారాయణ ఆయనకు దుస్సాలువ వేసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఈయన వెంట, నిడదవోలు పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు గూడపాటి వెంకట్రావు, తెలుగు దేశం పార్టీ పోలవరం నియోజక వర్గ అబ్జర్వర్ అనపర్తి వెంకట నారాయణ( జయ ) తెదేపా నాయకులు కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు.

➡️