కృష్ణబాబు కుటుంబానికి పలువురి పరామర్శ

May 24,2024 14:57
కృష్ణబాబు

ప్రజాశక్తి – కొవ్వూరు రూరల్‌
మాజీ ఎంఎల్‌ఎ, పారిశ్రామికవేత్త పెండ్యాల వెంకట కృష్ణారావు(కృష్ణబాబు) కుటుంబాన్ని పలువరు ప్రముఖులు గురువారం పరామర్శించారు. ఆయన ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో పలువురు ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు దొమ్మేరు వచ్చారు. నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణరాజు (ఆర్‌ఆర్‌ఆర్‌), మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహనరావు, అవంతి ఇండిస్టీస్‌ ఛైర్మన్‌ అల్లూరి ఇంద్రకుమార్‌, ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు, కొవ్వూరు కూటమి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు దివానంలో కృష్ణబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కృష్ణబాబు సోదరులు నరేంద్రనాథ్‌చౌదరి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌కృష్ణలను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కృష్ణబాబు మరణానికి గల కారణగాలను తెలుసుకున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం రఘురామకృష్ణరాజు మాట్లా డుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగులేని నాయకునిగా కృష్ణబాబు సేవలు అందించారన్నారు. ఎందరినో రాజకీయంగా ప్రోత్సహించారన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆదర్శవంతమైన రాజకీయాలతో అభివృద్ధికి కృషి చేశారన్నారు. ఆయన దక్షత తమ లాంటి వారికి స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. నాయకులు మద్దిపాటి శివరామకృష్ణ, ఆళ్ల హరిబాబు, కలగర సుబ్బారావు, కెవికె.రంగారావు, ఐ.వీరశంకరం, గారపాటి రామకృష్ణ, యలమర్తి రాంబాబు తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు.

➡️