గోరంట్లను కలిసిన సచివాలయ సిబ్బంది

Jun 10,2024 14:51 #East Godavari

ప్రజాశక్తి-కడియం : కడియం మండలం గ్రామ, వార్డు సచివాలయ యూనియన్ నాయకులు, సిబ్బంది రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాద పూర్వకంగా కలిసారు. సోమవారం కడియం నుండి బయలుదేరిన సిబ్బంది గోరంట్ల ను ఆయన స్వగృహం లో కలిసి మొక్కను అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా గోరంట్ల మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది పనితీరు బాగుందని, కొత్త ప్రభుత్వo లో కూడా మీరు కస్టపడి పనిచేయాలని, మీకు అన్నిరకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నట్లు యూనియన్ నాయకులు పేర్కొన్నారు. అలాగే సామాజిక మధ్యమాలలో వచ్చే వదంతులను నమ్మవద్దని, ఉద్యోగభద్రత ఉంటుందని తెలియజేసారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామవార్డు సచివాలయ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి కాశీ విశ్వనాధ్, కడియం మండల యూనియన్ అధ్యక్షులు కె. సూర్య శ్రీనివాసరావు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

➡️