భక్తి శ్రద్ధలతో శ్రీ వల్లి సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం

Dec 18,2023 15:12 #East Godavari
sri valli subramanya shasti

ప్రజాశక్తి-కడియం : సుబ్రహ్మణ్యేశ్వ స్వామి షష్ఠి మహోత్సవాలు సోమవారం కడియం మండలంలో వాడ వాడలా ఘనంగా జరిగాయి. భక్తులు వేకువ జామున నుండి ఆలయాలకు చేరుకొని స్వామిని దర్శించుకుని పూలు, పడగలు సమర్పించుకున్నారు.  పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ముఖ్యంగా కడియం, బుర్రిలంక, వేమగిరి, జేగురుపాడు, మురమండ, వీరవరంలో వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారు జామున నుండే స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయాల వద్ద రద్దీ ఎక్కువవడంతో భక్తుల క్యూ లైన్లుతో ఎక్కడికక్కడ బారులు తీరారు. కడియం ఆలయం వద్ద షష్ఠి తీర్థాలు కొనుగోలు దారులు, చూపరులతో కళకళలడాయి . కడియం శ్రీ వల్లీ సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి గిరజాల కుటుంబ సభ్యులు ఆ ధ్వర్యంలో అర్చకులు అప్పిలి శ్రీమాన్ నారాయణ పరివేక్షణలో ఘనంగా నిర్వహించారు. గిరజాల రాజ శేఖర్ శ్రీ మౌనిక, పసుపులేటి సాయి, సుబ్రహ్మణ్య చైతన్ సాయి దుర్గా కుసుమ దంపతులు పాల్గొని స్వామివారికి అమ్మవార్లకి పట్టు వస్త్రాలు సమర్పించారు.

➡️