మంచి పాలన కోసం మీ ఓటు

Apr 7,2024 13:12 #East Godavari

డీఈఓ వాసుదేవరావు.
ప్రజాశక్తి-కడియం : మంచి పాలన కోసం అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి కె వాసుదేవరావు పిలుపునిచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం కడియంలో ఓటర్ల అవగాహన ర్యాలీ జరిగింది. స్థానిక విద్యా వనరుల కేంద్రం నుండి దేవీ సెంటర్ వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బొబ్బిలి బ్రిడ్జి సెంటర్లో మానవహరం నిర్వహించి ఓటు హక్కు విలువను తెలిపారు. ఈ సందర్భంగా డిఇఓ వాసుదేవరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అన్నారు. వందల ఉద్యమాలకు సాటి ఓటు అన్నారు. ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. అందరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కడియం ఎంఈఓలు మణికుమార్,వై. నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణ, ఇవిఎస్ఆర్ ప్రసాద్, విశ్వనాథం సుధ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత చిలుకూరి శ్రీనివాసరావు, యుటిఎఫ్ నాయకులు అబ్బాయి, ఆనంద విజయకుమార్, వల్లూరి శ్రీనివాసరావు, టీవీఎస్ ప్రసాద్, ఎస్ టి యు నాయకులు సబ్బితి శ్రీనివాసరావు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు గొల్లపల్లి సత్యనారాయణ, ఉంగరాల వీరభద్రరావు, ఎండి ఖాన్, డిటిఎస్ నాగేంద్ర, ఇందిర, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️