ఆదర్శ రాజేంద్రన్‌కు వీణ బహూకరణ

ప్రజాశక్తి – నూజివీడు రూరల్‌

నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌కు రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సిబ్బంది బుధవారం వీణను బహూకరించారు. ఇటీవల సాధారణ బదిలీల్లో భాగంగా సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ రాజేంద్రన్‌ నెల్లూరు జిల్లాకు బదిలీ కావడంతో రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని సిబ్బందితో కాసేపు ముచ్చటించారు. ప్రతిఒక్కరూ విధి నిర్వహణలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందాలని ఆయన సూచించారు.

➡️