ఉచిత వైద్య శిబిరంలో మందుల పంపిణీ

ఉంగుటూరు : నారాయణపురంలో లవ్‌ ఇన్‌ యాక్షన్‌ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వంగాయగూడెం గుడ్‌ సమరిటన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి వైద్యులు వైద్య శిబిరంలో పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. లవ్‌ ఇన్‌ యాక్షన్‌ సంస్థ అధ్యక్షుడు ఎస్‌.పాల్‌దినకరన్‌, ట్రెజరర్‌ ఎస్‌.అబ్నెర్‌, నాయకులు యు.ముసలయ్య, భుజంగరావు, కలపాల కుమార్‌ పాల్గొన్నారు.

➡️