కొనసాగిన న్యాయవాదులు రిలే దీక్ష

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం

ప్రజా వ్యతిరేక చట్టాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి హక్కులు కాపాడుకోవాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి చంద్రమోహన్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ల్యాండ్‌ టైటిల్స్‌ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ జంగారెడ్డిగూడెం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహారదీక్ష శిబిరాన్ని బుధవారం ఆయన సందర్శించి సంగీభావం తెలిపారు. బుధవారం దీక్షలో ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్‌ కుమార్‌, కార్యదర్శి ఎవివి.భువనేశ్వరి, మేకల రామ మోహనరావు, సొలస రవిధర్మరాజు, ఓగిరాల సువర్ణ రత్న కుమార్‌, ఇనుముల శ్రీనివాస్‌ పాల్గొన్నారు. జనసేన నాయకులు చిర్రి బాలరాజు, మేక ఈశ్వరయ్య, గడ్డ మణుగ రవికుమార్‌ సందర్శించి సంఘీభావం తెలిపారు.

➡️