కొల్లేరు ప్రజల కష్టాలు తీరుస్తాం

గుడివాకలంకలో 33/11 కెవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్య చౌదరి

ప్రజాశక్తి – ఏలూరు టౌన్‌

కొల్లేరు ప్రజల కష్టాలు పూర్తిగా తొలగించేందుకు కృషి చేస్తన్నట్టు దెందులూరు ఎంఎల్‌ఎ కొఠారు అబ్బయ్య చౌదరి చెప్పారు. ప్రజా ఆశీర్వాద యాత్ర-2లో భాగంగా గుడివాకలంకలో రూ.4 కోట్ల 60 లక్షలతో నిర్మించిన 33/11 కేవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్‌ స్టేషన్‌ గృహావసరాలు పూర్తిగా తీరడమే కాకుండా ఆక్వాకి ఊతం ఇస్తుందన్నారు. ప్రజలు కోరిన వెంటనే సమస్యను సిఎం దృష్టికి తీసుకువెళ్లి, సంబంధిత అధికారులను పలుమార్లు కలిసి, సరైన ప్రణాళికలు రూపొందించి, ప్రత్యేక అనుమతులు సాధించి, దశాబ్దాల తమ కరెంట్‌ సమస్యను తీర్చడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణ, జెడ్‌పి ఛైర్మన్‌ ఘంటా పద్మశ్రీ ప్రసాద్‌, ఎఎంసి ఛైర్మన్‌ అప్పన కనకదుర్గ ప్రసాద్‌ పాల్గొన్నారు

➡️