ఘనంగా క్రాంతి హైస్కూల్‌ 36వ వార్షికోత్సవం

ప్రజాశక్తి – కలిదిండి

గ్రామీణ ప్రాంతంలో ప్రయివేటు విద్యాసంస్థ నెలకొల్పి 36 వసంతాలు పూర్తి చేసుకోవడం యాజమాన్య నిబద్ధతకు నిదర్శనమని కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని కోరుకొల్లు క్రాంతి హైస్కూల్‌ 36వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. అప్సా డెమెక్రిటిక్‌ రాష్ట్ర నాయకులు గొల్లపూడి మోహనరావును సన్మానించారు. తొలుత క్రాంతి ఎడ్యుకేషనల్‌ అండ్‌ చారిటబుల్‌ సొసైటీ ట్రెజరర్‌ సిహెచ్‌.సుబ్బలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేశారు. విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి. క్రాంతి హైస్కూల్‌ కరస్పాండెంట్‌ చన్నం శెట్టికృష్ణ, ప్రిన్సిపల్‌ చన్నం శెట్టి అజేష్‌ బాబు ఆధ్వర్యంలో జరిగిన 36వ వార్షికోత్సవంలో ఎంపిపి చందన ఉమామహేశ్వరరావు, అప్సా కైకలూరు డివిజన్‌ అధ్యక్షులు ఎవి.కోటేశ్వరరావు, క్రాంతి హైస్కూల్‌ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️