చందు కుటుంబానికి సాయం

ప్రజాశక్తి – కొయ్యలగూడెం

మండలంలోని సరిపల్లి పంచాయతీ ధర్మారావు గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు అదేపల్లి చందు చనిపోవడంతో అతని తల్లిదండ్రులు అదేపల్లి లాజరు, మేరీని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు, నియోజవర్గ ఇన్‌ఛార్జి రాజ్యలక్ష్మి పరామర్శించి ఆర్థికసాయం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ గొడ్డాటి నాగేశ్వరావు, వైసిపి గ్రామ కన్వీనర్‌ మందపాటి రామకృష్ణ, ఎంపిపి గంజిమాల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి విష్ణు, ఏలూరు సోషల్‌ మీడియా కన్వీనర్‌ చిక్కాల దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️