చర్చి నిర్మాణానికి విరాళమివ్వడం అభినందనీయం

ప్రజాశక్తి – చింతలపూడి

ఆర్‌సిఎం చర్చికి రూ.10 వేలు విరాళం ఇవ్వడం అభినందనీయమని ప్రగడవరం మాజీ ఎంపిటిసి కనుమత రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. చింతలపూడి మండలం ప్రగడవరం పంచాయతీ అంకంపాలం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆర్‌సిఎం చర్చికి రూ.10 వేలు మాజీ ఎంపిటిసి రాజా చేతులుమీదుగా మానేపల్లి రాజారావు ఆదివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంకంపాలెం గ్రామ పెద్దలు, సంఘస్తులు పాల్గొన్నారు.

➡️