డిగ్రీ కళాశాలలో యూత్‌ ఫెస్టివల్‌

భీమడోలు : సమైక్యత, సోదర భావం, సమ భావన పెరగడానికి పండగల సందర్భంగా చేపట్టే కార్యక్రమాలు సహకరిస్తాయని భీమడోలు శ్రీవెంకటేశ్వర డిగ్రీ, జూనియర్‌ కళాశాల ప్రధాన ఆచార్యులు బొమ్ము రవికుమార్‌, వంగా నాగేశ్వరరావు అన్నారు. కళాశాలకు చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో సంక్రాంతి పురస్కరించుకొని యూత్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. సంక్రాంతి ప్రాముఖ్యత వివరించే రీతిలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం విద్యార్థులకు ముగ్గుల పోటీలు, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం బాధ్యులు బి.నాగరాజు పాల్గొన్నారు.

➡️