నులుపురుగు నివారణ దినోత్సవాన్ని జయప్రదం చేయాలి

చాట్రాయి: ఆరోగ్యకరమైన చిన్నపిల్లలను కాపాడటానికి నులుపురుగులను నులిమేద్దామని చాట్రాయి మండల ఎంపిడిఒ మంగాకుమారి అన్నారు. బుధవారం చాట్రాయి ఎంపిడిఒ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యాధికారి ఎ.శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ చిన్నపిల్లల ఎదుగుదల లోపానికి, రక్తహీనతకు కారణమైన నులిపురుగుల నివారణ కోసం ఒకటి నుంచి రెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఆల్బెండజోల్‌ 200 మిల్లీగ్రాముల మాత్రలు వాడాలని, రెండు సంవత్సరాల నుంచి పైపడిన చిన్న పిల్లలకు 400 మిల్లీగ్రాముల మాత్రలు వాడి నులుపురుగులను నివారణ చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్య సిబ్బంది వెంకటరమణ, అంగన్వాడీలు, ఆశాలు పాల్గొన్నారు.

➡️