నూతన డిఎస్‌పిగా రవిచంద్ర బాధ్యతలు

జంగారెడ్డిగూడెం టౌన్‌: జంగారెడ్డిగూడెం నూతన డిఎస్‌పిగా రవిచంద్ర బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్‌పి మేరి ప్రశాంతి ఆదేశాల మేరకు డిఎస్‌పిల బదిలీలు జరిగాయి. అందులో భాగంగా జంగారెడ్డిగూడెం టౌన్‌ డిఎస్‌పిగా పనిచేస్తున్న ధనుంజయుడు రిలీవ్‌ అవ్వగా ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన రవిచంద్ర జంగారెడ్డిగూడెం టౌన్‌ డిఎస్‌పిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు.

➡️