పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

జీలుగుమిల్లి : జాతీయ పశురోగ నివారణ కార్యక్రమంలో భాగంగా పశువులకు గాలి కుంటువ్యాధి సోకకుండా మంగళవారం నుంచి వ్యాధి నివారణ టీకాలు వేస్తున్నట్లు ప్రాంతీయ పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎమ్‌.సాయి బుచ్చారావు తెలిపారు.02 తారీకు నుంచి 31 తారీకు వరకు మండలం లోని అన్ని సచివాలయల పరిధిలోని గ్రామాలలో పశు వైద్య సిబ్బంది అధ్వర్యంలో పశువులకు టీకాలు వేయనున్నట్లు ఆయన తెలిపారు.కావున మండలం లోని పాడి రైతులు వ్యాధి సోకకుండా పశువులకు ముందు గానే టీకాలను వేయించుకోవాల్సింది గా రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది రాజు, భవాని, సచివాలయ వెటర్నరీ అసిస్టెంట్‌ లు పాల్గొన్నారు..

➡️