పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం

జీలుగుమిల్లి: పేద ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందించేందుకే జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసినట్లు సర్పంచి సున్నం ఉషారాణి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని దర్భగూడెం సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన రెండవ విడత జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ఎంపిడిఒ కెఎమ్‌.మంగతాయారుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసమే ప్రభుత్వం ఆరోగ్య సురక్ష శిబిరాలను ఏర్పాటు చేసిందని, ఈ శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసిలు సున్నం సురేష్‌, కంచర్ల సుధారాణి, ఇఒపిఆర్‌డి నిఖిల్‌ మధుశరణ్‌ పాల్గొన్నారు.

➡️