పోలీసుల కవాతు

ప్రజాశక్తి – ముదినేపల్లి

జిల్లా ఎస్‌పి మేరీ ప్రశాంతి ఉత్తర్వుల మేరకు సోమవారం ముదినేపల్లి మండలంలో సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది రోడ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు రోడ్‌మార్చ్‌ నిర్వహించారు. మండలంలోని గురజ, దేవపూడి, సింగరాయపాలెం, ముదినేపల్లి సెంటర్లలో సిఆర్‌పిఎఫ్‌ సిబ్బంది రాబోవు జనరల్‌ ఎలక్షన్‌ నిమిత్తం ఓటర్లు స్వచ్ఛందంగా వారి ఓటు హక్క వినియోగించుకునేలా ఓటర్లకు మనోధైర్యం కల్పించేందుకు పోలీసులు రోడ్‌మార్చ్‌ నిర్వహించారు.

➡️