ప్లెక్సీలు తొలగించిన అధికారులు

ప్రజాశక్తి – కలిదిండి

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో కలిదిండి ప్రధాన సెంటర్‌తో పాటు పలు గ్రామాల్లో అధికారులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. పలుచోట్ల నుంచి వస్తున్న సమాచారంతో పాటు స్వయంగా పరిశీలిస్తూ ప్లెక్సీలు, హోర్డింగులను తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనలో నిమగమయ్యారు. తహశీల్దార్‌ వంశీ, ఎంపిడిఒ దినతేజ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సిహెచ్‌.విశ్వ కుమార్‌, ఇఒపిఆర్‌డి రాజారావు, పంచాయతీ, రెవెన్యూ, సచివాలయ, మండల పరిషత్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️