బస్సులోంచి పొగలు.. ప్రయాణికుల కంగారు

తప్పిన ప్రమాదం

చింతలపూడి : చింతలపూడి మండలం ఆందోనినగరం వద్ద ఏలూరు డిపోకు చెందిన బస్సు ఒకసారిగా ఇంజన్‌లోంచి పొగలు రావడంతో ప్రయాణికులు కంగారుపడి బస్సులో నుంచి కిందకి దిగిపోయారు. దీంతో డ్రైవర్‌ మార్గ మధ్యలోనే బస్సును నిలపివేయడంతో ప్రమాదం తప్పింది. వివరాల్లోకెళ్తే.. ఏలూరు నుంచి చింతలపూడి వస్తుండంగా ఒక్కసారిగా బస్సులోనుంచి పొగలు రావడంతో ప్రయాణికులు ప్రాణ భయంతో బస్సు దిగి దూరంగా వెళ్లిపోయారు. సుమారుగా 35 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్లుగా సమాచారు. ప్రయాణికులు అక్కడి నుంచి వేరే వాహనాలు చూసుకున్నారు. బుస్సులోంచి పొగలు రావడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

➡️