మంచినీటి చెరువులు త్వరగా నింపుకోవాలి

ముదినేపల్లి: మండలంలోని మంచినీటి చెరువులను పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు త్వరితగతిన నింపుకోవాలని ముదినేపల్లి మండల పోల్‌ రాజ్‌ కెనాల్‌, సిబి కెనాల్‌ ఎఇఇలు కిషోర్‌, సిద్ధార్థ కోరారు. బుధవారం ముదినేపల్లిలో వారు మాట్లాడుతూ ప్రస్తుతం పంట కాల్వల ద్వారా వస్తున్న నీటిని కార్యదర్శులు పంట కాలవల నుంచి లిప్ట్‌ చేసుకుని మంచినీటి చెరువులు నింపుకోవాలన్నారు. కాలువల్లో నీరు పూర్తిస్థాయిలో రానందున ఇంజిన్‌ ఏర్పాటు చేసుకోవాలన్నారు. మరో రెండు, మూడు రోజులు మాత్రమే కాలువలకు నీరు వస్తుందని, తరువాత కాలువలను మూసివేయడం జరుగుతుందన్నారు. పంట కాలువల ద్వారా వచ్చే తాగునీటిని ఎవరైనా ఆక్వా రైతులు చేపల చెరువులకు మళ్లీస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

➡️