మహిళలకు చీరల పంపిణీ

ప్రజాశక్తి – ముదినేపల్లి

మండలంలోని వణుదుర్రులో ఆదివారం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన ఈదా బైరాగి(రిటైర్డ్‌ ఉద్యోగి) గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రతి క్రిస్మస్‌కి పేద మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామంలోని 150 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన భార్య బాయమ్మ,కుమార్తెలు ఎం.విజయకుమారి, చంద్రలీలా, గ్రామ పెద్దలు లేళ్ల ఆంజనేయులు, ఐజాక్‌, రెడ్డియ్య పాల్గొన్నారు.

➡️