మానవత సంస్థ చైతన్య రథం ప్రారంభం

ప్రజాశక్తి – ద్వారకా తిరుమల

ద్వారకాతిరుమల శ్రీనివాస జూనియర్‌ కాలేజీ వద్ద మానవత స్వచ్ఛంద సంస్థ సభ్యులు మండల ప్రజల సౌకర్యార్థం నూతనంగా కొనుగోలు చేసిన చైతన్య రథం ప్రారంభించారు. టిడిపి మాజీ జెడ్‌పిటిసి సభ్యులు మొగడతల శ్రీనివాస్‌ లక్ష్మీ రమణి రూ.5 లక్షల పైచిలుకు విలువ గల మానవత చైతన్య రథాన్ని ద్వారకాతిరుమల మండల గ్రామ ప్రజలకు వినియోగం కొరకు మొగడతల సత్యనారాయణ జ్ఞాపకార్థం మానవత సంస్థ వారికి అందించారు. మానవత సభ్యులు మాట్లాడుతూ ఈ రథం సమకూర్చుటకు మొగతడకల శ్రీనివాస్‌ లక్ష్మీ రమణి పూర్తి సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత స్వచ్చంద సంస్థ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

➡️