మృతుని భార్యకు రూ.10 వేలు అందజేత

ప్రజాశక్తి – ఆగిరిపల్లి

కృష్ణాజిల్లా సహాకార కేంద్ర బ్యాంక్‌ సర్కులర్‌ ప్రకారం పి ఎసిఎస్‌లో రు ణాలు పొందిన ల బ్ధిదారులు స హజ మరణం పా లైనట్లయితే సదరు కు టుంబానికి మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు అందజేయడం జరుగుతుందని కెడిసిసి బ్యాంక్‌ ఆగిరిపల్లి బ్రాంచి మేనేజర్‌ కె.మరియమ్మ తెలిపారు. మండల పరిధిలోని తోటపల్లి పిఎసిఎస్‌లో పంట రుణము పొందిన లబ్దిదారుడైన మెండె కోటేశ్వరరావు మరణించటంతో అతని భార్య మెండె జయకాంతమ్మకు గురువారం రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి పిఎసిఎస్‌ ఛైర్‌పర్సన్‌ సింహాద్రి నాగబాబు, సిఇఒ బెజవాడ రమేష్‌బాబులు పాల్గొన్నారు.

➡️