మోకాళ్లపై రోడ్డుకు అడ్డంగా నిలబడి మున్సిపల్‌ కార్మికుల నిరసన

ప్రజాశక్తి – చింతలపూడి

ప్రభుత్వం మొండి వైఖరిగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్‌విఎస్‌.నారాయణ అన్నారు. చింతలపూడి నగర పంచాయతీ కార్మికుల సమ్మె ఆదివారం 13వ రోజుకు చేరింది. మున్సిపల్‌ కార్మికులు నగర పంచాయతీ కార్యాలయం ముందు మోకాళ్లపై రోడ్డుకు అడ్డంగా నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు కనీస వేతనాలు అమలు చేయాలని, మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టి.విజయరాజు, జి.నాగరాజు, వి.పద్మ, వల్లి, కె.నాగరాజు, ఎం.సత్యనారాయణ, మనోహర్‌, మధు, శివ, ఈశ్వర్‌, పద్మ, దేవాసహాయం పాల్గొన్నారు.

➡️