రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

మరొక ఇద్దరికి గాయాలు

ప్రజాశక్తి – భీమడోలు

దెందులూరు మండలం గుండుగొలను హైస్కూల్‌ వద్దగల జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు చనిపోగా, మరొక ఇద్దరు గాయాలపాలయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గుండుగొలను గ్రామానికి చెందిన గంటా బాబు, నత్తా వంశీ, కొవ్వలి సురేష్‌ ఒకే మోటర్‌ సైకిల్‌పై వస్తుండగా హైస్కూల్‌ సమీపంలో డివైడర్‌ను ఢకొీన్నారు. వాహనం అదుఫు తప్పడంతో రోడ్డుపై పడ్డారు. వీరిలో గంటాబాబు ఘటనా స్థలిలోనే చనిపోగా తీవ్రంగా గాయపడిన నత్తా వంశీ ఏలూరులోని ప్రయివేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఇతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలియ వచ్చింది. మరొక యువకుడు కొవ్వలి సురేష్‌ ఏలూరు ప్రభుత్వ వైద్యాశాలలో చికిత్స పొందుతున్నారు.

➡️