విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌

పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మంగళవారం జంగారెడ్డిగూడెం ఆర్‌టిసి ఎఒకి వినతిని అందించారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి కె.లెనిన్‌ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖమ్మం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, ఏలూరు జిల్లాలో ప్రభుత్వం విలీనం చేసిందన్నారు. అప్పటి నుంచి రెండు మండలాల్లో చదువుతున్న విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో భద్రాచలం డిపో నుంచి బస్సు సౌకర్యం ఉండేదని, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ఆంధ్ర వాళ్లకి బస్సు సౌకర్యం తీసివేశారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న సర్వీస్‌ అన్ని ఎక్స్‌ప్రెస్‌లే ఉన్నాయి కాబట్టి జంగారెడ్డిగూడెం, వేలేరుపాడు నుంచి ఏర్పాటు చేసిన బస్సులు కూడా స్కూలు సమయానికి కాకుండా వేరే సమయానికి వస్తున్నాయని తెలియజేశారు. దీనివల్ల కుక్కునూరు చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు నెలకి రూ. వెయ్యి నుంచి 2, వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. కావున విద్యార్థులు సమస్యలు, చదువులు దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా బడి బస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు బి.యశ్వంత్‌, జి.మణి పాల్గొన్నారు.

➡️