వైఎస్‌ఆర్‌ ఆసరా చెక్కుల పంపిణీ

ప్రజాశక్తి – పోలవరం

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి గర్భిణుల నుంచి వృద్ధాప్యంలో ఉన్న అవ్వ తాతల వరకు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి అన్నారు. పోలవరం మండల కేంద్రంలోని స్థానిక మండల మహిళా సమైక్య ఐకెపి కార్యాలయం ఆవరణలో జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలోని నాలుగో విడత ఆసరా కార్యక్రమం ఎపిఎం బెజవాడ శ్రీనివాసరావు ఆధ్వర్యాన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వైసిపి పోలవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి తెల్లం రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. మండలంలో 942 స్వయం సహాయక సంఘాలకు రూ.7 కోట్ల 32 లక్షల 89 వేల 14 చెక్కును నియోజకవర్గ సమన్వయకర్త రాజ్యలక్ష్మి చేతులమీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యలక్ష్మి మాట్లాడుతూ ఎంఎల్‌ఎగా నన్ను గెలిపించాలని, మా కుటుంబం ఎప్పుడూ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటుందని రాజ్యలక్ష్మి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపిపి సంఘాల అధ్యక్షులు ఎంపిపి సుంకర వెంకట రెడ్డి, డ్వామా పీడీ కె.విజయ రాజు, ఎంపిడిఒ జి.శ్రీను, తహశీల్దార్‌ ప్రసాద్‌ పాల్గొన్నారు.

➡️