వైసిపిలోకి పలువురు

ప్రజాశక్తి – ముదినేపల్లి

మండలంలోని వడాలి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధికి యువకులు ఆకార్షితులై పెద్ద ఎత్తున సోమవారం రాత్రి 150 మంది వైసిపిలోకి చేరారు. డిఎన్‌ఆర్‌ తనయులు దూలం వీర ఆది వినరు కుమార్‌ సమక్షంలో కటికల మునియ్య, పాండురంగారావు ఆధ్వర్యంలో వైసిపిలోకి చేరారు. వీరందరికీ దూలం వినరు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి రామిశెట్టి సత్యనారాయణ, నాయకులు ఈడే వెంకటేశ్వరావు, ఎఎంసి వైస్‌ ఛైర్మన్‌ బత్తిన కిషోర్‌, మరీదు హనుమంత్‌, రాష్ట్ర బిసి నాయకులు కోమటి విష్ణువర్ధన్‌, మర్రివాడ వీర రెడ్డి సుధాకర్‌ రెడ్డి, కో-ఆప్షన్‌ సభ్యులు షేక్‌ అల్లాబక్షు, రాచురి కుమార్‌, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️