వైస్‌ ఎంపిపి విష్ణుకి మాతృవియోగం

ప్రజాశక్తి – మండవల్లి

మండవల్లి మండల వైస్‌ ఎంపిపి ఆగస్తి ఆది విష్ణుకు మాతృవియోగం కలిగింది. ఆది విష్ణు మాతృమూర్తి అనసూయమ్మ ఉనికిలి సచివాలయం పరిధిలోని మూలపేటలోని ఆయన నివాసంలో ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు కీర్తిశేషులయ్యారు. సమాచారం అందుకున్న ఎంపిపి పెద్దిరెడ్డి శ్రీరామ్‌ దుర్గాప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అగస్తి ఆదివిష్ణు నివాసం చేరుకుని అనసూయమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

➡️