శాంతిభద్రతలు కాపేడేందుకు చర్యలు : ఎస్‌ఐ

ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్‌

ఉన్నతాధికారుల ఆదేశాలతో శాంతిభద్రతలు కాపాడేందుకు పూర్తిస్థాయిలో చర్యలు చేపడతానని మూడో పట్టణ ఎస్‌ఐ ఫణీంద్ర తెలిపారు. ఏలూరు మూడో పట్టణ ఎస్‌ఐగా జి.ఫణీంద్ర సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. 2012 ఎస్‌ఐ బ్యాచ్‌కు చెందిన ఈయన ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా మొట్టమొదటి ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అనంతరం కృష్ణా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన ఎస్‌ఐగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన గవర్నర్‌ పేట ఎస్‌ఐగా పనిచేస్తూ ఉండగా సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలోని మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. సోమవారం ఆయన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉన్నతాధికారులు, ఏలూరు మూడో పట్టణ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు.

➡️