సిఎం రిలీఫ్‌ ఫండ్‌ అందజేత

ప్రజాశక్తి – చింతలపూడి

రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తుందని చింతలపూడి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి కంభం విజయరాజు అన్నారు. చింతలపూడిలోని గ్రామానికి చెందిన కె.జ్యోతికి సిఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి విడుదలైన రూ.70 వేల చెక్కును కంభం విజయ రాజు, చింతలపూడి మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ జగ్గవరపు జానకి రెడ్డి, జెడ్‌పిటిసి నీరజ జ్యోతికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జ్యోతి అనారోగ్యానికి గురికావడంతో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తమై సిఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. ఈమేరకు ప్రభుత్వం ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.70 వేలు రిలీజ్‌ చేయడంతో మంగళవారం చెక్కును ఆమెకు అందజేయడం జరిగిందని తెలిపారు. తనకు అండగా నిలిచిన సిఎం జగన్మోహన్‌ రెడ్డికి రుణపడి ఉంటానని జ్యోతి తెలిపింది. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

➡️