21వ రోజు అంగన్వాడీలు వినూత్న నిరసనలు

ప్రజాశక్తి – యంత్రాంగం

అంగన్వాడీల సమ్మె సోమవారానికి 21వరోజుకు చేరింది. ఈ సందర్భంగా పలుచోట్ల వినూత్నంగా నిరసన తెలిపారు. నూతన సంవత్సర వేడుకలను సైతం అంగన్వాడీలు రోడ్లపైనే జరుపుకున్నారు. కేకులు కట్‌చేశారు. జిల్లావ్యాప్తంగా అంగన్వాడీలంతా విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. భీమడోలు:మండలంలో అంగన్వాడీల నిరవధిక సమ్మె 21వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆటపాటలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ నాయకులు స్వర్ణ కుమారి, చల్లామ, రాజమణి నాయకత్వం వహించారు.కొయ్యలగూడెం : మండలంలోని అంగన్వాడీలు ఒంటికాలిపై నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శుక్లబోయిన రాంబాబు, అంగన్వాడీ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు శివరత్నకుమారి, పి.పద్మజ, జె.నాగవేని, అడపా నాగజ్యోతి, సిహెచ్‌.సునీతారాయల్‌, బొబ్బిలి చిట్టి, కె.జ్యోతి, మాధవి, భాగ్యలక్ష్మి, ఎం.వెంకటలక్ష్మి, మంగ, శ్రీదేవి, నుర్జహాన్‌ పాల్గొన్నారు.ముసునూరు : స్థానిక సచివాలయం ముందు అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నూజివీడు ప్రాజెక్టు కార్యదర్శి పల్లిపాము రాజకుమారి, దుర్గ, కలపాల విద్యావతి, మేరీ సులోచన, శిరీష, లక్ష్మీ, విజయలక్ష్మి, వెంకటేశ్వరమ్మ , అలివేలు పాల్గొన్నారు.జీలుగుమిల్లి : మండలంలోని అంగన్వాడీలు తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన సమ్మె శిబిరం వద్ద నృత్యాలతో, నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తూ నిరసన తెలిపారు. అనంతరం కేకు కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కొండలరావు, సిపిఎం నాయకుల అప్పారావు, అంగన్వాడీలు నాగమణి, ఎస్తేరు, సరళ, పూర్ణ, జ్యోతి పాల్గొన్నారు. కలిదిండి : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీల సమ్మె 21 రోజూ కొనసాగింది. మాజీ జెడ్‌పిటిసి సభ్యులు నున్న రమాదేవి, ఓబిసి నాయకులు లావేటి వీర శివాజీ సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు షేక్‌ అబిదా బేగం, జక్కంశెట్టి మేనక లక్ష్మి, కొప్పినేడి రమాదేవి, అంగనవాడీలు, హెల్పర్లు పాల్గొన్నారు.పోలవరం : మండలంలోని అంగన్వాడీల సమ్మె 21వ రోజూ కొనసాగింది. సమ్మెకు సిఐటియు మండల కార్యదర్శి పిఎల్‌ఎస్‌.కుమారి సంఘీభావం తెలిపారు. చాట్రాయి : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ మండలంలోని అంగన్వాడీలు స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద పిడికిలి బిగించి నిలబడి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమీలారాణి, ఏసమ్మ, మణి పాల్గొన్నారు.మండవల్లి : పండుగలను వీధుల్లోనే చేసుకునే చేసిన ఘనత సిఎం జగన్‌కు దక్కిందని అంగన్వాడీలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమ్మె 21వ రోజూ కొనసాగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల యూనియన్‌ నాయకులు వాణి, చెల్లమ్మ, విజయలక్ష్మి, ఉమాదేవి, మల్లేశ్వరి, అంగన్వాడీలు, ఆయాలు పాల్గొన్నారు.చింతలపూడి : నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం స్పందించి సమ్మెను విరమింపజేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్‌విఎస్‌.నారాయణ, అంగన్వాడీ, మున్సిపల్‌ సమ్మె శిబిరాలను సందర్శించి మాట్లాడారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సమ్మె విరమించుకుంటే కార్మికులను మార్చాల్సి వస్తుందని పత్రికా ప్రకటన చేశారని, కార్మికులను తమరు మార్చడం కాదని కార్మికవర్గం తలచుకుంటే మిమ్మలను మార్చే సత్తా ఉందని గ్రహించి మాట్లాడాలన్నారు. అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 31న జరిపిన ఆట పాట పోటీలలో చింతలపూడి మండలంలో గెలిచి న అంగన్వాడీలకు బహుమతులు ప్రధానం చేశారు.ఈరోజు కార్యక్రమంలో ప్రాజెక్టు కార్యదర్శి టి.మాణిక్యం, జి.సరళ, హేమలత, పద్మ, అరుణ, చెన్నకేసరి, మున్సిపల్‌ కార్మికులు జి.నాగరాజు, సత్యం, వంశీ, వల్లి పాల్గొన్నారు.టి.నరసాపురం : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి వారి సమ్మెను విరమింపజేయాలని యుటిఎఫ్‌ మండల నాయకులు జి.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. నిడమర్రు : అంగన్వాడీల పట్ల ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణరావు విమర్శించారు. స్థానిక సమ్మె శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో రబియ, ధనలక్ష్మి, కెవి.సత్యవతి, రామలక్ష్మికుమారి, పార్వతి, జయమ్మ మాట్లాడారు.ఆగిరిపల్లి : అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని నూజివీడు నియోజకవర్గ టిడిపి బిసి సెల్‌ అధ్యక్షులు ఆరేపల్లి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గత 22 రోజలుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు టిడిపి నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నక్కనబోయిన వేణు, దొండపాటి ఏసుపాదం, నలజాల హరిబాబు పాల్గొన్నారు.ముదినేపల్లి : అంగన్వాడీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం వ్యవహరించడం దారుణమని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిన్న మాధవ అన్నారు. తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని ఆమె సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ, రిబ్కా, మణి, పద్మ పాల్గొన్నారు.

➡️