ప్రజల దాహార్తిని తీరుస్తున్న మజ్జిగ చలివేంద్రం

ప్రజాశక్తి – ముదినేపల్లి

ముదినేపల్లిలో స్టేట్‌ బ్యాంక్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రజల దాహార్తిని తీరుస్తుంది. శ్రీవిజయలక్ష్మి ట్రాన్స్‌పోర్ట్‌ యాజమాన్యం యనమల అంకినీర్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ప్రజల, బాటసారుల దాహార్తిని తీరుస్తుంది. గత పది రోజులుగా చలివేంద్రం ద్వారా ప్రజలకు మజ్జిగ, మంచినీటిని సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో ప్రతిరోజు మజ్జిగ సరఫరా చేస్తుండడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు, రహదారిన పోయే ద్విచక్ర వాహనదారులు ఆగి మజ్జిగ తీసుకుని, తిరిగి ప్రయాణం అవుతున్నారు. నిర్వాహకులు అంకినీడు చలివేంద్రాన్ని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున ప్రజలు చలివేంద్రానికి వచ్చి తమ దాహార్తిని తీర్చుకుంటున్నారు. రోజురోజుకీ చలివేంద్రం వద్ద రద్దీ పెరగడంతో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా అందుకు తగ్గ ఏర్పాట్లను నిర్వాహకులు అంకినీడు చేపడుతున్నారు. గత మూడు సంవత్సరాల నుంచి వరుసగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ, ప్రజల దాహార్తిని అంకినీడు తీరుస్తున్నారు.

➡️