రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబుని గెలిపించాలి

టిడిపి రాష్ట్ర నాయకులు వంగవీటి రాధ

ప్రజాశక్తి – ముసునూరు

రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టిడిపి రాష్ట్ర నాయకులు వంగవీటి రాధ అన్నారు. ముసునూరు మండలంలోని అక్కిరెడ్డిగూడెంలో టిడిపి నూజివీడు నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి కొలుసు పార్థసారధికి సానుభూతిగా ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి పేదలకు ఎన్నో పథకాలు ఇస్తూ బటన్‌ నొక్కటం పేరట తన వ్యక్తిగత ఖాతాలో అదే బటన్‌ నొక్కుతూ ఎన్నో వందల వేల కోట్లు దోచేశాడన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని శూన్య ఆంధ్ర రాష్ట్రంగా తయారుచేయడానికి సిద్ధంగా ఉన్నారని, మరోసారి జగన్మోహన్‌ రెడ్డి వస్తే రాష్ట్రం అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే వెనక వరుసలో ప్రథమ స్థానంలో ఉంటుందని విమర్శించారు. టిడిపి ఎంఎల్‌ఎ అభ్యర్థి కొలుసు పార్థసారధిని గెలిపించాలని కోరారు.

➡️