రాష్ట్రాభివృద్ధికి సిఎం చర్యలు

చంద్రబాబును కలిసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి – ముసునూరు
రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్లే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని, జాతీయస్థాయిలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని టిడిపి ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. అమరావతిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా ముద్దరబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పరిశ్రమలు స్థాపనకు పారిశ్రామికవేత్తలు క్యూ కొడుతున్నారన్నారు. నూజివీడు నియోజకవర్గం ఏరియా అభివృద్ధి పనులపై సమీక్షించినట్లు ఆయన తెలిపారు.

➡️