బర్రింకలగరువులో నోబుల్‌ ప్రచారం

ప్రజాశక్తి – కలిదిండి

మండలంలోని పడమటిపాలెం పంచాయతీ పరిధి బర్రింకలగరువులో కాంగ్రెస్‌ కైకలూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ అభ్యర్థి బొడ్డు నోబుల్‌ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేస్తూ, రానున్న ఎన్నికల్లో ఇండియా వేదిక బలపరిచిన తనను, కాంగ్రెస్‌ ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యను గెలిపించాలని కోరారు. నాయకులు ఈదా పద్మారావు, భూషణం, సైమన్‌ రాజు పాల్గొన్నారు.

➡️