చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

ప్రజాశక్తి – జంగారెడ్డిగూడెం టౌన్‌

వేసవికాలం ప్రయాణికులకు సౌకర్యంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వైసిపి సీనియర్‌ నాయకులు బత్తిన చిన్నా, జెట్టి ఆదిత్య అన్నారు. జంగారెడ్డిగూడెంలోని 4వ వార్డు ఇందిరానగర్‌ కాలనీ కొత్తపేటలో వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదివారం చిప్పాడ వెంకన్న ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బత్తిన చిన్నా, జెట్టి ఆదిత్య మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి వేసవిలో ప్రయాణికులకు ఆసరాగా నిలవాలని తెలిపారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొండా బత్తుల నరేంద్ర, కొండా బత్తుల రమేష్‌, కోన పాము, అయ్యన్న, కుసుమే నాని, కుర్రు ప్రభాకర్‌ రావు, దున్న శివ పాల్గొని మజ్జిగ పంపిణీ చేశారు.

➡️