అవగాహనతో క్షయ అంతం

ప్రజాశక్తి-రాయచోటి అవగాహనతోనే క్షయ వ్యాధి అంత మవుతుందని, ఈ నెల 16 నుంచి జిల్లాలో క్షయ వ్యాధి నివారణకు బిసిజి ఉచిత టీకా పంపిణీ కార్య క్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా ధికారి డాక్టర్‌ కొండయ్య అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ వైద్య ఆరోగ్య శాఖకు తగు ఆదేశాలు జారీ చేశామన్నారు. జిల్లాలో 2025 నాటికి టిబి నివారణే లక్ష్యంగా ఈ నెల 16 నుంచి జిల్లాలోని అన్ని సచివాలయాలలో ప్రతి గురువారం 3 నెలలు పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది ద్వారా ఉచితంగా టీకాలు వేస్తామన్నారు. 18 ఏళ్లు పైబడి ఐదేళ్లలోపు క్షయ కొరకు మందులు మింగి టిబి వ్యాధి నయం అయిన వారికి, క్షయవ్యా ధిగ్రస్థుల కుటుంబసభ్యులకు, మధుమేహ వ్యాధి గస్థులకు, ధూమపానం సేవించే వారికి, 60 ఏళ్లు పైబడి వయస్సు కలవారికి ఈ బిసిజి ఉచిత టీకా పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ఆరోగ్య సిబ్బంది, సంబంధిత గ్రామ పంచాయతీ అధికారులను, అంగన్వాడీ సిబ్బందిని, టిబి ఛాంపియన్లను సమన్యయ పరుచుకొని ఈ టీకా ప్రాముఖ్యత ప్రజలకు తెలియచేసి వాక్సిన్‌ కార్య క్రమంను విజయవంతం చేయుటకు కృషి చేయాల న్నారు. ఈ టీకా ప్రాముఖ్యత దృష్ట్యా మీడియా సహ కారం ఎంతో అవసరమని మీడియా వారందరూ కూడా కార్యక్రమ విజయవంతానికి సహకారిం చాలని పాత్రికేయులను కోరారు. రాష్ట్ర స్థాయి అధికారి డాక్టర్‌ దేవసాగర్‌ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ బిసిజి టీకా కార్యక్రమం ఎంపిక చేసిన జిల్లాలలో ప్రారంభిస్తామన్నారు. అన్నమయ్య జిల్లా బిసిజి టీకా పంపిణీ కార్యక్ర మానికి ఎంపిక అయినందున మన జిల్లాలో కూడా రేపటి నుంచి మూడు నెలల పాటు ప్రతి గురు వారం బిసిజి టీకా పంపిణీ చేయడానికి జిల్లా ఉన్నతాధికారులు, ప్రాథమిక ఆరోగ్య కంద్రాల వైద్యా ధికారుల సహాయ సహకారాలతో అన్ని సచివాల యంలలో ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ వాక్సిన్‌ కార్యక్రమం ఎక్కడ ఆయితే జరుగుతుందో సంబంధిత ఆరోగ్య సిబ్బంది ముందుగానే మీమీ ఏరియా ప్రజలకు వాక్సిన్‌ యొక్క ప్రాముఖ్యతను తెలియచేసి వారి యొక్క సమ్మతితో ఈ వాక్సిన్‌ కార్యక్రమం జయప్రదం చేయాలని సూచించారు. గర్భిణులు, పాలు ఇచ్చు తల్లులకు, ఎచ్‌ఐవి వ్యాది óగ్రస్థులకు, కేన్సర్‌ పేషంట్లకు, మూడు నెలలలో రక్తమార్పిడి చేసుకున్న వారికి ఈ టీకా ఇవ్వడం జరగదని ప్రజలు అందరు అపోహలు వీడి స్వచ్ఛం దంగా ముందుకు వచ్చి టిబి (క్షయ) రహిత సమాజం కోసం పాటుపడాలని తెలియచేశారు. కార్యక్రమాన్ని జిల్లా క్షయవ్యాధి నివారణ అధికారి, జిల్లా ఇమ్మునైజేషన్‌ అధికారి కార్యక్రమంలో పాల్గొని నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. పీలేరు : క్షయ వ్యాధి నిర్మూలనా కార్య క్రమంలో భాగంగా గురువారం నుంచి పెద్దలకు బిసిజి వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తలుపుల పిహెచ్‌సి ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ రమేష్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ మే నెల 16 నుంచి తలుపుల పిహెచ్‌సి పరిధిలోని 8 సచివాలయాల్లో గుర్తించి, సమ్మతి పొందిన వయోజనులకు ప్రతి గురువారం బిసిజి టీకాలను సూక్ష్మ ప్రాణాళికను అనుసరించి ఇస్తామన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగు ణంగా ప్రతి వెయ్యి మంది జనాభాలో 20 శాతం మంది వయోజనులు ఈ బిసిజి వ్యాక్సిన్‌కు అర్హులని చెప్పారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి, టిడి వ్యాధి రాకుండా ఈ వాక్సిన్‌ కాపాడుతుందని తెలిపారు. సమావేశంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ కొండయ్య, పర్యవేక్షకులు కృష్ణయ్య పాల్గొన్నారు.

➡️