టిడిపితోనే రైతుల సంక్షేమం : గొట్టిపాటి

ప్రజాశక్తి-దర్శి : టిడిపితోనే రైతుల సంక్షేమం సాధ్యమని టిడిపి దర్శి నియోజక వర్గ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. మండల పరిధిలోని అబ్బాయిపాలెం, నడింపల్లి, కొత్తూరు, వెంకటాచలంపల్లి, చలివేంద్ర తానా చింతల, తిమ్మాయిపాలెం, దేవవరం, కట్టుబడి వారిపాలెం, శేషంవారి పాలెం పోతవరం గ్రామాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ముఖ ్యమంత్రి అయితేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివద్ధి చెందుతుందన్నారు. పేదలందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తనను ఆదరించాలన్నారు. జనసేన దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జి గరికపాటి వెంకట్‌ గొట్టిపాటి లక్ష్మికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో గొట్టిపాటి లక్ష్మిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు టిడిపిలో చేరారు. కడియాల లలిత సాగర్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, టిడిపి మండల అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు, నాయకులు ఇరుగుల పోలిరెడ్డి, సుబ్బయ్య, ఏడుకొండలు, చిన్నయ్య, రమణారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️