మరోసారి అవకాశమివ్వండి : రాజన్నదొర

Apr 29,2024 22:14

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గంలో గిరిజనుల కష్టసుఖాలు బాగా తెలిసినోడినని, తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. సోమవారం ఆయన మండలంలోని అన్నంరాజువలస పంచాయతీ పరిధిలో గల చీపురు వలస, రెయ్యవానివలస, గాదెలవలస గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. వైసిపి ప్రభుత్వ హయాంలోనే గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం హయాంలోనూ ఇన్ని సంక్షేమ పథకాలు అందలేదని చెప్పారు. ఈ పథకాలు కొనసాగాలంటే రాష్ట్రంలో మళ్లీ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. ఎమ్మెల్యేగా తనని, ఎంపి అభ్యర్థి తనూజారాణికి ఫ్యాన్‌ గుర్తు పై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి నాయకులు ఆర్నిపిల్లి మురళి, ఎంపిటిసి సభ్యులు సీదరపు అనూష పాల్గొన్నారు.21వ వార్డులో వైసిపి ప్రచారంరానున్న ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు ఓటు వేయాలని పట్టణ జెసి ఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు కోరారు. సోమవారం ఆయన పార్టీ కార్యకర్తలతో కలిసి 21వ వార్డులో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కురుపాం : మండలంలోని జి.శివడ, గుజ్జువాయి, వలస బల్లేరు, ఊసకొండ పంచాయితీల్లో గల పలు గిరిజన గ్రామాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఫ్యాను గుర్తుపై ఓటు వేసి తమకు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక వైసిపి సీనియర్‌ నాయకులు గురుబిల్లి రాజారావు, సర్పంచులు బి.మిన్నారావు, హెచ్‌.నాగేశ్వరరావు, ఎంపిపి శెట్టి పద్మావతి, జిల్లా షేక్‌ నిసార్‌ , పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శృంగవరపుకోట : నాయీ బ్రాహ్మణులను గుర్తించి ఆదరించిన పార్టీ వైసిపి అని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం పట్టణంలోని ఆపార్టీ కార్యాలయంలో నాయీ బ్రాహ్మణులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో నాయీ బ్రాహ్మణులను గుర్తుంచి, ఆదరించి, అక్కున చేర్చుకున్న ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్‌ రెడ్డి అని అన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘ పెద్దలు మాట్లాడుతూ మాకు అనేక రకాలగా ఆదరించి మమ్మలిని గుర్తించిన ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావును, ఎంపిగా ఝాన్సీలక్ష్మిని గెలిపించుకుంటామని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఆతవ రమేష్‌, నియోజకవర్గ కన్వీనర్‌ కోడూరు శ్రీనివాస్‌, సన్యాసిరావు, ఈశ్వరరావు, శివ, ఐదు మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు.

➡️