వృద్ధులకు అన్నదానం

ప్రజాశక్తి-ఒంగోలు: కలెక్టరేట్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా అధ్యక్షులు, మాంటిస్సోరి స్కూలు అధినేత పి ప్రకాష్‌బాబు, జయశ్రీ దంపతుల వివాహ రోజు వేడుకలు శివం శరణాలయంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శివం సంచార వాహనం ద్వారా అన్నదానం నిర్వహించారు. అనంతరం శరణాలయంలో పి ప్రకాష్‌ బాబు, కుమారుడు శబరినాథ్‌, కోడలు ఈషా సమక్షంలో కేకు కట్‌ చేసి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మారెళ్ల సుబ్బారావు, రచయిత, నటుడు డాక్టర్‌ మొగిలిదేవ మాట్లాడారు. నేరెళ్ల సుబ్బారావు శివం శరణాలయానికి రెండు స్టాండ్‌ ఫ్యాన్లు అందజేశారు. కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కోశాధికారి రాఘవ, శివం ఫౌండేషన్‌ చైర్మన్‌ గొల్లపూడి శ్రీహరి పాల్గొన్నారు.

➡️