బాబు వస్తే రూ.4 వేలు పింఛన్‌: గొట్టిపాటి లక్ష్మి

ప్రజాశక్తి-దర్శి: మాజీ సిఎం నారా చంద్రబాబు అధికారంలోకి వస్తేనే వృద్ధులందరికీ నాలుగు వేల రూపాయలు పింఛను ఇస్తారని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం దర్శి పట్టణంలోని 12 వార్డులో గొట్టిపాటి లక్ష్మి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది వృద్ధులకు పెన్షన్‌ ఎందుకు రాలేదని ఆరా తీశారు. కరెంట్‌ బిల్లు ఎక్కువ వస్తున్నందున పెన్షన్‌ ఆపేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే రూ.4000 పెన్షన్‌ వస్తుందని తెలిపారు. అదే విధంగా చంద్రబాబు అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని, అభివృద్ధి జరుగుతుందని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎంఎల్‌ఎగా తనను, ఎంపిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా సాయంత్రం తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటి గంగమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గంగవరం ప్రచారం చేశారు. దర్శి పార్టీ కార్యాలయంలో ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామానికి చెందిన వైసిపి అధ్యక్షుడు పశుపుగల్లుకు చెందిన పలువురు బిజ్జం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టిడిపిలో చేరిన సందర్భంగా ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, గొట్టిపాటి లక్ష్మి, భర్త డాక్టర్‌ లలిత్‌ సాగర్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ కార్యక్రమాలలో నూకసాని బాలాజీ, నారపుశెట్టి పాపారావు, నగర పంచాయతీ చైర్మన్‌ నారపుశెట్టి పిచ్చయ్య, మండల పార్టీ అధ్యక్షుడు చిట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు యాదగిరి వాసు, శోభారాణి, తాళ్లూరు మండల పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్‌రెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు సేగం కొండారెడ్డి, రమేష్‌, వల్లభనేని సుబ్బయ్య, రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి గొర్రెపాటి వేణు, వెంకటేశ్వరరెడ్డి, బొడ్డు హనుమారెడ్డి, రామకోటిరెడ్డి, కాశిరెడ్డి పలువురు పాల్గొన్నారు.

➡️