అంగన్‌వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టం తగదు

Jan 7,2024 16:37 #Anganwadi strike, #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం తగదని ఆర్‌సిసి అధ్యక్షులు ఏసి శ్రీకాంత్‌ రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు తిప్పన్న, పిఎస్‌ గోపాల్‌, అధ్యక్షులు రామాంజనేయులు, ఏఐటియుసి నాయకులు వీరేష్‌, విజరు అన్నారు. ఆదివారం ఆదోనిలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు వరలక్ష్మి పద్మ జానకి అధ్యక్షతన ఎస్మా జీఓ కాపీలను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేతనాలు పెంచకుండా జీఓలు తెస్తూ చివరకు ఎస్మా చట్టాన్ని తీసుకున్న రావడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని ఆరోపించారు. భయభ్రాంతులకు గురి చేసినా అంగన్వాడీలు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని సమ్మెను విరమించే దిశగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో అంగనవాడి వర్కర్లు హెల్పర్లు ఎన్ని రోజులైనా సమ్మెకు సిద్ధంగా ఉంటామని పిలుపునిచ్చారు. అంతకుముందు మున్సిపల్‌ మెయిన్‌ రోడ్‌ లో ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లో సోమక్క, గీత, రేణుక, సోమేశ్వరి, శారదా, గౌసీయా, గీతా పాల్గొన్నారు

➡️