పంప్డు స్టోరేజీ ప్రాజెక్టుపై జిపిఎస్‌ సర్వే

పంప్డు స్టోరేజీ ప్రాజెక్

ప్రజాశక్తి -సీలేరు: జికె. వీధి మండలం సీలేరులో నెలకొల్పే పంప్డు స్టోరేజ్‌ ప్రాజెక్టు సరిహద్దుల గుర్తింపు, పరిశీలనకు మెగా కనస్ట్రక్షన్‌ కంపెనీ ఆధ్వర్యంలో జిపిఎస్‌ సర్వే శరవేగంగాసాగుతోంది. ఎపి జెన్‌కో కాంప్లెక్స్‌ పరిధి సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యం గల పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకున్న మెగా కనస్ట్రక్షన్‌ కంపెనీ జనరల్‌ మేనేజర్‌ శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో సరిహద్దు రాళ్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో శని,ఆదివారాల్లో సర్వే నిర్వహించారు. గతంలో ప్రాజెక్టుకు సంబంధించిన సర్వేను గతంలో వ్యాప్‌ కోస్‌ కంపెనీకి ఎపి జెన్‌కో అప్పగించడంతో వారు సర్వే నిర్వహించి పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి డిజైన్‌ రూపొందించారు. సుమారు 215 హెక్టార్ల అటవీ భూములో ప్రాజెక్ట్‌ నిర్మాణం సాగనున్న నేఏపథ్యంలో సీలేరు నది నుంచి నీటిని మళ్లించేందుకు అవసరమైన అండర్‌ గ్రౌండ్‌ పైప్‌ లైన్‌ నుంచి వచ్చిన మట్టిని వేయడానికి డంపింగ్‌ యార్డ్‌కు అటవీశాఖ 215 హెక్టార్లు భూమిలో ప్రాజెక్టు నిర్మాణం చేపడతారు. ఈ భూమిలో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఎక్కడెక్కడ హద్దురాళ్ళు ఏర్పాటు చేశారు అనే అంశాలపై మెగా కన్స్ట్రక్షన్‌ కంపెనీ ఇంజనీర్లు సర్వే చేపట్టారు. వ్యాప్‌కో కంపెనీ నిర్వహించిన సర్వే మ్యాప్‌ను మెగా కన్స్ట్రక్షన్‌ కంపెనీకి జెన్‌కో అప్పగించింది. ఆ మ్యాప్‌ ఆధారంగా ప్రాజెక్టు నిర్మాణ స్థలం హద్దులు గుర్తించి సర్వే నిర్వహించారు. త్వరలో పంపు స్టోరేజ్‌ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి ఎపి జెన్‌కో చర్యలు వేగవంతం చేయనుంది. వ్యాప్‌ కో కంపెనీ ప్రాజెక్ట్‌ డిజైన్‌ చేసిన మ్యాప్‌ను మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ పరిశీలిస్తూ విధి విధానాలు పరిశీలించి సర్వే వేగవంతంగా కొనసాగిస్తోంది.

సర్వే చేస్తున్న మెగా కంపెనీ ఇంజినీర్లు

➡️