రజక వృత్తిదారుల హామీలను నెరవేర్చాలి

ఎపి రజక వత్తిదారుల సంఘం

ప్రజాశక్తి మాధవధార : . ఎన్నికలకు ముందు రజక వృత్తిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఎపి రజక వత్తిదారుల సంఘం జిల్లా కార్యదర్శి ఎం.ఈశ్వరరావు డిమాండ్‌ చేశారు. సోమవారం. కంచరపాలెం సిఐటియు కార్యాలయంవద్ద రజక వృత్తిదారుల సంఘం సమావేశంలో మాట్లాడుతూ . కంచరపాలెం ప్రాంతంలో నివసించేందుకు రజకులకు పక్కాఇళ్లు, వృత్తిస్థలాలు, దోభీఘాట్లు మంజూరు చేయాలని, రజకుల రక్షణకు సామాజిక చట్టం చేయాలని, 50ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని, దోభీ పోస్టులను రజకులతోనే భర్తీ చేయాలని,. లాండ్రీలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ మంజూరు చేయాలన్నారు కార్యక్రమంలో ఎస్‌.ఈశ్వరరావు . బి చిన్నారావు, ఎం అప్పారావు, కె. శ్రీను, బి రాజారావు, ఎం తిరుపతిరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఈశ్వరరావు

➡️