‘నేను బడికిపోతా’

Jun 17,2024 21:07

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మండలంలోని సతివాడలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని సోమవారం జిల్లా సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక అవసరాల పిల్లలు, బడి ఈడు పిల్లలు ప్రత్యేక నమోదు కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్షా జిల్లా ఎఎంఒ బి.ప్రసాద్‌, సిఎంఒ బి. ఆదినారాయణ, ఐఇ కో ఆర్డినేటర్‌ ఎం.భారతి మాట్లాడుతూ తల్లి దండ్రులు బడి ఈడు పిల్లలు, ప్రత్యేక అవసరాల పిల్లలను ఆయా పాఠశాలల్లో నమోదు చేయాలని కోరారు. సాధారణ పిల్లలను కూడా ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేయాలని సూచించారు. ముఖ్యంగా నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా అందరూ తలిదండ్రులు పిల్లలను నమోదు చేయాల్సిన బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒలు యు. సూర్య నారాయణ మూర్తి, ఈపు విజరు కుమార్‌, హెచ్‌ఎంలు ఆర్‌. బంగారు నాయుడు, వి. కృష్ణమూర్తి, వి.శ్యాంసుందర్‌, ఐఈఅర్‌టి బి. అప్పలనాయుడు, సిఆర్‌పి బి. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

➡️