చంద్రబాబు మాట ఇస్తే తప్పరు..

Jul 1,2024 20:41
ఫొటో : పింఛన్‌ను అందజేస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

ఫొటో : పింఛన్‌ను అందజేస్తున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

చంద్రబాబు మాట ఇస్తే తప్పరు..

– దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి

– ఆత్మకూరులో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం

ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు పురపాలక పరిధిలోని 11, 12, 13 వార్డులలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి పెన్షన్లు పంపిణీ చేశారు. ఆత్మకూరు రూరల్‌ మండలంలోని బట్టేపాడు గ్రామంలో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మంత్రి పింఛన్లను అందించారు. ఆత్మకూరు పురపాలక పరిధిలో 6వ వార్డులో ఆనం కైవల్యా రెడ్డి చేతుల మీదగా పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణరెడ్డి పెరుమాళ్ళుపాడు ఆనం గార్డెన్స్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేదప్రజలకు సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పింఛన్ల పంపిణీకి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 65లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రూ.3వేల పెన్షన్లను రూ.4వేలుగా, బకాయిలు కలుపుకొని రూ.7వేల పెన్షన్లు జూలై మాసం నుండి పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం రూ.1976 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చిందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 65లక్షల మందికి 4వేల400 కోట్ల రూపాయలు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సోమవారం ఉదయం 6 గంటల నుండి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ఈరోజు సాయంత్రానికి 90శాతం పూర్తవుతుందని మంగళవారం నాటికి నూరుశాతం పంపిణీ పూర్తవుతుందని ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా లబ్ధిదారులు ఇంటికికెళ్లి ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ మూడు రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సోమవారం సాయంత్రానికి పూర్తి చేయాలని అధికారులు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో మంత్రులు ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరు కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్‌ పంపిణీ చేశారన్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు సంఘం మండలం సిద్ధిపురం, వీవర్స్‌ కాలనీ వీవర్స్‌ కాలనీలో పెన్షన్‌ పంపిణీ చేశామన్నారు. అనంతరం ఎఎస్‌పేటలోని హసనాపురం, చిరమన, గ్రామాల్లో పంపిణీ చేశామన్నారు. అనంతరం ఆత్మకూరు మున్సిపాలిటీలో, ఆత్మకూరు రూరల్‌ మండలంలోని ఆత్మకూరు రూరల్‌ మండలంలోని బట్టేపాడు గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. చేజర్ల మండలంలోని ఎస్‌సి కాలనీలో బోడిపాడు ఎస్‌టి కాలనీలో పెన్షన్‌ పంపిణీ చేశామన్నారు. అనంతసాగరం మండలంలోని సోమశిల, అనంతసాగరం గ్రామాల్లో, మర్రిపాడు మండలంలో మర్రిపాడు, డి.సి.పల్లి గ్రామాలలో పెన్షన్లు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సాంబశివారెడ్డి, జిల్లా పరిషత్‌ సిఇఒ కన్నమనాయుడు, ఆత్మకూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి మధులత, ఆనం కైవల్యరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ కొమ్మి లక్ష్మయ్య నాయుడు, జిల్లా మాజీ సొసైటీ చైర్మన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, టిడిపి సీనియర్‌ నాయకులు తాళ్లూరు గిరి నాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గోపారం వెంకటరమణమ్మ, టిడిపి పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మాజీ ఉప సర్పంచ్‌ చల్లా రవికుమార్‌ రెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఐ వి రమణారెడ్డి, ఎంపిపి కేత వేణుగోపాల్‌ రెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నాయుడు, కాలం బుజ్జిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

➡️