గెలిపిస్తే తాగునీటి సమస్య పరిష్కరిస్తా

Apr 12,2024 21:24

ప్రజాశక్తి-బొబ్బిలి : సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే పాతబొబ్బిలిలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన అన్నారు. మున్సిపాలిటీలోని పాతబొబ్బిలిలో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బేబినాయనకు తాగునీటి సమస్యను ప్రజలు వివరించారు. దీనిపై బేబినాయన పైవిధంగా స్పందించారు. ప్రచారంలో జనసేన నాయకులు అప్పలస్వామి, బాబు పాలూరి, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️